Friday, February 5, 2021

భ్రమ - నిజం - అబద్ధం - 2

దైవ సాక్షాత్కారం - పూర్వజన్మ సంస్కారం చేతగాని, ఈ జన్మలో భగవంతుని దృష్టిలో చేసిన మంచి పనుల వల్ల గాని మాత్రమే దైవ సాక్షాత్కారం కలుగుతుందని ఎక్కువమంది నమ్ముతారు. 

ఇంకొక విషయము, ఎంత జ్ఞాన సంపన్నులైనా అతను పాటించని జ్ఞానమార్గము అతనిని వెనుకకు నెట్టి అతని ద్వారా జ్ఞాన విషయములు తెలుసుకొని పాటించిన పామరునికి దైవ సాక్షాత్కారం లభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది దైవ మాయ లేక దైవ న్యాయముగా భావించాలి. సరదాగా నడుస్తూ వెళ్తున్నప్పుడు మనకు దేవుడు కనిపిస్తే సందేహిస్తాము. నేను దేవుడనని ఆయన స్వయంగా చెప్పినా నమ్మలేని సందేహము. దానిలో మీరు ఏ డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ అని అడుగుతాము. భగవంతుని రూపంలో ఒక బలమైన అదృశ్యశక్తి ఉందని అందరూ నమ్మినా, భగవంతునికి రూపం ఉన్నదా, లేదా అని తేల్చుకోలేని స్థితిలో ఎక్కువ మంది జనం ఉన్నారు. కొందరయితే మీ మహిమలు చూపండి, నమ్ముతాము అని అంటారు. ఈయుగంలో ఎలక్ట్రానిక్ సాంకేతికత, మామూలు మాయలు, కనికట్టు, గారడీలు చూపేవారు మధ్య మధ్య మనకు కనబడతారు. ఎలక్ట్రానిక్ మాయలో వైర్లెస్ కూడా వస్తుంది. కొన్ని శతాబ్దముల క్రితం పురాణములలో రాసిన విధముగా ఆకాశవాణి మాట్లాడినట్టు మనకి తెలుస్తుంది. దాన్ని సైన్స్ ప్రకారం నిరూపిస్తే  నిజమని నమ్ముతామని చెప్పేవారు రేడియో అనే ఆకాశవాణి కనుగొనబడినప్పుడు భగవంతుడిని వైర్లెస్ సిద్ధాంతం ద్వారా పాత వార్తను సహజముగా నమ్ముతారు. సృష్టి క్రమములో కనుక్కోబడని రహస్యములు చాలా ఉన్నవని  గమనించాలి. నిజము మాట్లాడితే దేవుని రూపమును మనం చూడలేదు. సినిమాల ప్రభావంతో దేవుని రూపం మన మనసులో ఊహించుకుని ముద్రించుకొన్నాము అన్నది కాదనలేని వాస్తవం.

భగవంతుడు సృష్టించాడని భావించే మనుషులమైన మనము మనలో కొందరు మహిమలు, అద్భుతాలు చేయగల స్థితిలో ఉన్నప్పుడు భగవంతునికి లీలలు ప్రదర్శించడం కష్టం కాదు. అంతకంటే మాకు కూడా మహిమలు ప్రదర్శించే శక్తి కావాలని కోరుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచించాలి.  నిజముగా దైవ సాక్షాత్కారం కలిగినప్పుడు దానికి తగిన అర్హత ఉంటే, ఆధ్యాత్మిక కోరికలు లేనివారు భగవంతుని ప్రార్ధించి పొందవచ్చు.

ఇలాంటి సందర్భములు జీవితములో ప్రతి వారికి వస్తాయి. ప్రపంచములో జరిగే ప్రతి విషయం గమనించే శక్తిని చూడాలి. కళ్ళు చూసి ఆ విషయం మనసుకు చేరవేసి, ఆ తర్వాత నిజమేదో, అబద్ధమేదో తెలియని భ్రమ స్థితిలో మనిషి ఉంటాడు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చెప్పినట్లు  మనసులో ఇప్పటికీ ఇంద్రియముల తీరు స్పష్టంగా తెలిసినప్పటికీ, మనం భ్రమలో పడకుండా ఉండాలంటే కళ్ళు సరిగ్గా పని చేయాలని తెలుపుతుంది. భ్రమలకు దూరంగా ఉండాలంటే కళ్ళు వాటి పాత్రను చక్కగా పోషించాలి. సూక్ష్మంగా ఆలోచిస్తే కళ్ల ద్వారా కొన్ని నేరాలకు ప్రోత్సాహం జరుగుతుందని కొందరి అభిప్రాయం. ఈ జీవితంలో మనము చేసే ఎన్నో విషయములకు భ్రమ పడతాము.  కొన్ని భ్రమలను జీవిత కాలంలో నిగ్గు తేల్చలేము. భ్రమ అపార్ధాలు కలిగిస్తుంది. అనుమానం పెంచుతుంది. అన్నీ కలిపి హింసకు లేదా అనవసరమైన చర్యలకు ప్రోత్సాహం ఇస్తుంది. భ్రమలో ఉన్నప్పుడు మాయ మనలను కప్పి వేస్తుంది. మాయ అంటే నెగిటివ్ ఫోర్స్ అనే వ్యతిరేక శక్తిగా భావిద్దాం.

భ్రమ యొక్క మాయ తొలగడానికి ఆధ్యాత్మిక శక్తి కావాలి. దీనికి మంచి ఆధ్యాత్మిక పుస్తకములు చదివి మన దైనందిన దినచర్యలో దైవమునకు కొంత సమయం కేటాయించాలి. నచ్చిన దైవ ప్రార్థనలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. తరచు దేవాలయ దర్శనం కొంత భగవంతుని ఉనికిని మనకు గుర్తు చేస్తుంది. అన్నిటికీ మనసే మూలం. మనసు స్వాధీనంలో ఉండాలి. అందరికీ వచ్చే సందేహం మనము వయసులో ఉండి సౌఖ్యములు అనుభవించకుండా మనసు స్వాధీనం ఏమిటి, బెటర్ ఎంజాయ్ లైఫ్, ముసలితనంలో దేవుని గురించి ఆలోచిద్దాం. - ఇదే భూమి మీద పుట్టిన అధిక సంఖ్యాకుల  ఆలోచన. ఓకే ఎంజాయ్ ది లైఫ్ వితిన్ రీజనబుల్ లిమిట్స్. ఉదాహరణకు జీడిపప్పు ఎంతో ఇష్టంగా తినేవారు దానిని హద్దులేకుండా తింటే ఒళ్లంతా పట్టుకు పోతుందని భయపడతారు. అసలు నిజమైన విషయం ఏమిటంటే వయసులో ఉన్నప్పుడు మనము ఏ పని చేసినా, వయసు గడిచిన శరీరము అలసి సహకరించనప్పుడు మనము చెయ్యగలిగింది ఏమీ ఉండదని  అందరికీ తెలిసినా పూర్తి భ్రమలో ఉండడము. మానవ జన్మలో ఒక సహజ భావము ముసలితనంలో దేవుని ఆహ్వానించువారికి చిన్న జీవిత అనుభవం చూద్దాం. మనకు ఎవరూ తెలియని ఒక ఊరికి యాత్రగా కానీ లేక పనిమీద కానీ వెళ్ళినప్పుడు మొదటిసారి రాత్రిపూట బస ఏర్పాటు చేసుకున్నవారు తన పని అయిన తర్వాత రాత్రి బసకు చేరి నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవడం మనకు తెలిసిందే. దానికి భిన్నంగా వ్యవహరిస్తే వచ్చే ఇబ్బందిని భగవంతుని ముసలితనంలో ఆహ్వానించుటతో పోల్చుకోవచ్చు. ఇలా చేయకపోతే సరి అయిన  సమయంలో స్పందించని వారి క్రమశిక్షణలో ఒక భాగం మర్చిపోయినట్లే.

ఆధ్యాత్మికవేత్తల సత్సంగం వినండి. చింత లేని జీవితం మీ సొంతం చేసుకోండి.

నీతి: భ్రమలకు లోనవద్దు. విచక్షణ కోల్పోవద్దు.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...