Sunday, January 3, 2021

పలకరింపులు - గుర్తింపు - ఆనందము

మనము ఏదైనా పొరుగూరు పనిమీద వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఎవ్వరూ తెలియకపోయినా కొందరు పరిచయం చేసుకుని మన పని పూర్తి చేయుటలో సాయపడితే మనము సంతోషపడి వారిని కొంతకాలం గుర్తుంచుకుంటాము.

చిన్న ఉదాహరణలు:

1. నాకు తెలిసిన ఒక బ్యాంకు మిత్రుడు తను పని చేస్తున్న శాఖలో కౌంటర్ హాల్  నందు ఉన్న ఒక ముసలి వ్యక్తిని పలకరించి అతని పని పూర్తి చేయుటలో సహాయపడ్డాడు. ఆ తర్వాత డాక్టర్ అయిన అవతల వ్యక్తిని  అతని క్లినిక్లో ఈ మిత్రుడు కలిసినప్పుడు ఇతనికి కావాల్సిన పని చేయుటలో ఆయన చూపిన శ్రద్ధ ఇతనికి సంతోషం కలిగించింది.

నమ్మకం: ఒక్కొక్కప్పుడు ఎదుటివారికి చేసిన చిన్న సహాయము ఎంతో మేలు చేస్తుంది.

2. ఒక బ్యాంకులో పొరుగు జిల్లాకు సంబంధించిన దేవాలయ అధికారి, వ్యక్తిగత పనిమీద వచ్చి పని పూర్తి అయిన తర్వాత ఎప్పుడైనా తను ఉన్న దేవాలయమునకు వస్తే కలువమని ఆదరముగా ఆహ్వానించాడు. ఈ బ్యాంకు వ్యక్తి ఆ దేవాలయమునకు వెళ్ళాడో లేదో నాకు తెలియదు కానీ అవతలివారు వ్యక్తీకరించిన భావాలు విధి నిర్వహణ బాధ్యతను పెంచి, ఉద్యోగ సంతృప్తిని, సంతోషమును కలగజేస్తాయి.

3. అలాగే కొన్ని ఏళ్ళ క్రితం విశాఖపట్నంలో సిటీ బస్సులో పరిచయమై, ఆ తర్వాత 250 కిలోమీటర్లు నేను ఉన్న బ్యాంకుకి వచ్చి కథ చెప్పి కొంత డబ్బు చేబదులుగా తీసుకొని, నాకు తిరిగిరాని 24 ఏళ్ల బాకీ చిన్న వ్యతిరేక చర్యగా భావించాలి.

నీతి: కొందరిని పలకరించి వారికి చేసిన సహాయము తిరిగి కొందరికి అనుకోని రీతిలో మేలు కలిగించిననూ,  అందరి పరిచయాలు సంతోషము కావు. మోసగించబడక పోవుట ముఖ్యము.

                 తస్మాత్ జాగ్రత్త!

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...