Monday, December 7, 2020

శ్రీ సిద్ధ మంగళ స్తోత్రం

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ స్వామివారి జన్మస్థలం. ఇది కాకినాడకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయనకు ఎంతో ప్రీతికరమైన సిద్ధ మంగళ స్తోత్రం చదవటం ద్వారా విశేషమైన ఫలితం పొందుతాము.

1. శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ

2. శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ

3.  మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ

4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీ చరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ

5. సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజఋషి గోత్ర సంభవా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ

6. దో చౌపాతీ దేవ్ లక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీ చరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ

7. పుణ్య రూపిణీ రాజ మాంబ సుత గర్భ పుణ్యఫల సంజాతా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ

8. సుమతీ నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ

9. పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ

ఫల శృతి: శ్రీపాదవల్లభులకు ఎంతో ప్రీతికరమైన ఈ స్తోత్రమును పఠించిన వారిని  శ్రీపాద వల్లభులు అనుగ్రహిస్తారు. ఈ స్తోత్రమును పఠించిన చోట సిద్ధ పురుషులు స్వయంగా సందర్శించి దర్శన భాగ్యము కలుగచేయుదురు. ఈ స్తోత్రములు పఠించిన వారికి విశేష అన్నదాన ఫలము కలుగును.

దిగంబర  దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద రాజం శరణం ప్రపద్యే

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.