Friday, December 4, 2020

దేశ దేవాలయములు

1. జుత్తిగ గ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉమా వాసుకి సోమేశ్వర స్వామి దేవస్థానము -

పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు పట్టణమునకు 25 కిలోమీటర్ల దూరంలో జుత్తిగ గ్రామంలోని శివాలయ దర్శనం ద్వారా రాహు గ్రహ దోషముల వలన కలుగు కారాగార కష్టము, అన్యాయపు కేసుల నుండి విముక్తి, సత్వర కోర్టు న్యాయము జరుగునని భక్తుల విశ్వాసము. ఇచ్చట శివాభిషేకం  విశేషము.

2. శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానం - రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ గోదావరి ఒడ్డున గల ఈ దేవాలయంలో షష్టిపూర్తి, ఆయుష్ హోమం నిత్యము జరుగుతూ భక్తులను ఆకట్టుకుంటాయి. ఈ ప్రదేశం మార్కండేయుడిని చిరంజీవిగా శివుడు అనుగ్రహించిన చోటుగా భక్తులు నమ్ముతారు.

3. ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ భీమేశ్వర స్వామి దేవాలయం – పంచారామములలో ఒకటైన ఈ క్షేత్రం కాకినాడకు 32 కిలోమీటర్ల దూరంలో కలదు. దక్షిణ కాశీగా పేరుపొందినది. అన్నపూర్ణ దేవి శాపంచే కాశీ నుండి బయటకు వచ్చిన వ్యాసమహర్షి ఈ క్షేత్రమునకు వచ్చి స్వామి వారిని సేవించినట్టు స్థల పురాణం. అష్టాదశ  పీఠములలో ఒకటైన  శ్రీ మాణిక్యాంబ దేవాలయం ఈ గుడి ఆవరణలో ఉంది.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.