Thursday, December 3, 2020

మనస్సు శరీరం ద్వారా అమలు పరిచే గుణముల ఆట

కోరికలతో పుట్టినదే శరీరము. ఒక కోరిక తీరిన తర్వాత మరో కోరిక. అంతులేని కోరికల పుట్ట. 

మనసు కనుసన్నలలోనడచుట శరీర లక్షణం. కోరికలు తీరిన తర్వాత సన్యాసి కాలేడు. సంసార జీవితమే సమాజాభివృద్ధికి బాట.

కోరికలు తీరనప్పుడు తీవ్రమైన కోపము, రగిలే అసూయ. కోపము తీవ్రమైనప్పుడు శాంతమే మందు.  శాంతము సముద్రము కన్నా మిన్న అనే సామెత ఉంది.

జీవనవిధానంలో పిసినారితనం వస్తుంది. పిసినిగొట్టుతనమునకు విరుగుడుగా దాన గుణం లేదా ఉదారత్వం పనిచేస్తుంది. 

కొన్ని సందర్భములలో మనమే గొప్పవారమని భ్రమ వస్తుంది. దానితో మదము లేక పొగరు  బయటకు వస్తుంది. పొగరుకు వినయము ఔషధంగా పనిచేస్తుంది.

ఈ సందర్భంలో అహంభావం  బయటపడుతుంది. దీనికి గర్వము జత అయితే మనిషి  పతనమునకు ద్వారాలు తెరిచినట్లే. నిగర్వజీవన విధానం మెరుగైనది.

అవిశ్వాసం, ఆడంబర జీవన విధానం కాకుండా, విశ్వాసం, నిరాడంబర విధానం సమాజమునకు మేలు చేస్తుంది. సమతుల్య గుణ లేక జీవన విధానంతో సమాజ శ్రేయస్సు ముడిపడి ఉంది.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.