Wednesday, December 30, 2020

ప్రయత్నము

ప్రయత్నము అనగా మనకు గల కోరికలు, ఆశయాల సాధనలో జరుపు ఏ ప్రక్రియ అయినా ప్రయత్నంగా చెప్పవచ్చు. ఇది కర్త, కర్మ, క్రియలలో క్రియ భాగమునకు చెందుతుంది. 

ఏ ప్రయత్నమైనా మనలోని బద్ధకం వదిలించుకున్న తర్వాత ముందుకు సాగుతుంది. వాయిదా వేసుకునే మనస్తత్వం కూడా బద్ధకంలో ఒక లక్షణము. బద్ధకము పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు ముందుకు పోవడం జరగదు. ఏదైనా పని జరగనప్పుడు మన ప్రయత్న లోపం ఉందా అని ఆలోచిస్తాము.

భూమి మీద పడ్డ శిశువు ఏడుపుతో తన ఉనికిని ప్రపంచమునకు చెబుతాడు. అతడు దినదిన ప్రవర్ధమానమై తన ప్రతి కదలికలోను, అభివృద్ధిలోనూ తనదైన ప్రయత్నం చేసి విజయం సాధిస్తాడు. నిద్ర లేవగానే వ్యాయామమునకు ముందు చేయు వార్మింగ్ ఆప్ క్రియ ప్రయత్నమే. అనేక దినచర్యలు ప్రయత్నంతో ముడిపడి ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతి లేదా కోరుకున్న చోటికి బదిలీ కొరకు మన అర్హతతో పాటు సామర్థ్యం, పైవారి దృష్టికి తీసుకెళ్లే విధానం కూడా ప్రయత్నమే. మన ప్రయత్నంతో పాటు భగవంతుని ఆశీర్వచనాల రూపంలో అదృష్టం కలిసి రావాలని భగవంతుని నమ్మేవారు కోరుకుంటారు.

ప్రయత్నమే జీవితమునకు ఊపిరి లాంటిది. ఏ విజయ సాధన వెనుకైనా మానవ ప్రయత్నం ఉంటుందని మనము గమనించాలి. ఒక్కొక్కప్పుడు మన ప్రయత్నంలో భాగంగా మన శక్తి చాలనప్పుడు మన పరిచయస్తుల ద్వారా, బయట గల అధికార వ్యక్తులకు ప్రత్యక్షముగా లేక అంచలంచెలుగా విషయం చేరవేసి వారి సిఫార్సుల ద్వారా పని చేయించుకొనుట చాలామంది చేస్తారు.

అభివృద్ధి పరిచిన అనేక దూర దృశ్య శ్రవణ పద్ధతులు అందుబాటులో తెచ్చిన వారికి ధన్యవాదములు చెప్తూ అదే సమయంలో మంచితో పాటు మానవ సంబంధముల క్షీణతకు అది చేసిన కీడు మర్చిపోరాదు. ప్రపంచమును అరిచేతులలోకి తెచ్చిననూ, ఆప్యాయతకు అనురాగమునకు అది కలగజేసిన హాని చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. కాలక్షేపమునకు ఉద్దేశించిన  అనేక ఆధునిక వినోద సాధనములు విలువైన కాలమును హరించి మనిషిలో సోమరితనము, బద్ధకం పెంచుతున్నవి. వీటివల్ల శరీరమునకు కావలసిన కనీస శ్రమ తగ్గి శరీరము రోగాల పాలగుటతో కనీస వ్యాయామం ముఖ్య అవసరమైనది. దీనివల్ల సమాజమునకు హాని చాప కింద నీరులా జరుగుతుందని కొందరు పాతతరం వారి అభిప్రాయం. పెరిగిన విశ్రాంతి, ఆధునిక సౌకర్యములకు ఆధునిక ఉపకరణముల సహాయం గొప్పదని గుర్తించాలి. అయితే కొంతమంది పాతతరంవారికి ఆధునికతతో సర్దుకోవటం కష్టమే. ఈ రోజుల్లో కూడా కొందరు పచ్చళ్ల ప్రియులు మిక్సీలో వేసిన పచ్చళ్ల కంటే రోటి పచ్చళ్ల రుచిని మెచ్చుకోవడం మనం గమనిస్తాం.

పనిలో విశ్రాంతి ఎక్కువ దొరుకుటకు అనేక ఆధునిక సాధనములు వచ్చినవి. దానిలో ఒక భాగమైన టెలివిజన్ లేదా టీవీ అనే దృశ్య శ్రవణ సాధనము ద్వారా వచ్చు అనేక సీరియళ్లలో ఆడ విలన్ పాత్రలు చూచి ఆనందిస్తే పర్వాలేదు కానీ అదే పాత్రలోని నటన లేక సారాంశము మనసులో మిగిలిపోయినా, లేక కొందరు బలహీన లేక సున్నిత మనస్కులు ఆ పాత్రలను నిజ జీవితంలో అన్వయించుకున్నా మనసు అనుమానంతో నిండిపోతుంది. అటువంటివారు ప్రతి సంఘటనలో అపనమ్మకంతో అనగా వ్యతిరేక భావంతో నడుస్తారు. అలాంటి సంఘటన నిజజీవితంలో జరిగితే వారి జీవిత కాలంలో మనశ్శాంతి ఉండదు.

ఈ ప్రయత్న సాధనలో భాగంగా అనేక యంత్ర సాధనములు కనుగొనబడి అందుబాటులోకి వచ్చినవి. ఇందులో కొన్ని భక్తి భావాలు పెంచుటకు తోడ్పడుచున్నవి. ఉదాహరణకు కొందరు స్వామీజీలు కొన్ని ఆధునిక ఉపకరణాల ద్వారా, ఎంత దూరంలో ఉన్నప్పటికీ వారి ప్రవచనములు దగ్గరగా విన్నట్టు అనుభూతిని కలగజేస్తారు. కొన్ని ఉపకరణములు వాడినప్పుడు మన మనసులో ప్రకంపనలు కలుగజేసి, భగవంతుని దర్శించుటలో వచ్చు కొన్ని ఆటంకములకు అడ్డుకట్టగా పనిచేసి ఏకాగ్రతకు తోడ్పడతాయి. ఈ విషయం భగవంతుని మార్గములో నమ్మకం ఉంచి ప్రయత్నించు వారికి, విశ్లేషణకు వీలుగా వ్రాయబడినది.

కొందరు స్వామీజీలు వారి సంగీత క్యాసెట్లు విని రోగ నివారణ పొందమని కోరుతుండగా, మరికొందరు అనేక యోగ పద్ధతులు, ఆధునిక ఉపకరణముల ద్వారా తెలుసుకొని పాటించి అనుభూతి పొందమని చెబుతారు.

ప్రత్యేక సూచన: ప్రత్యేక సంక్లిష్టమైన సూచనలు కాక, సాధారణ సూచనలతో కూడిన దైవ అనుభూతి మార్గములను సాహసవంతులు, జిజ్ఞాసువులు ప్రయత్నించవచ్చు. మానవజన్మలో మనకు గల విచక్షణను ఉపయోగించి ఏ విషయమును గుడ్డిగా నమ్మకుండా, విపరీత అనగా శక్తికి మించిన ధన వ్యయము కాకుండా, ఎక్కువ శరీర శ్రమతో కూడని పద్ధతులు పాటించి ఫలితం పొందవచ్చు. దీనిని నిధి, నిక్షేపాల కొరకు జనము చేసే సాహస యాత్రతో పోల్చుకొని భగవంతుని వద్ద గల అపార ఆధ్యాత్మిక నిధి, నిక్షేపాలను (కేవలం ఆధ్యాత్మిక సంపద) పొందగోరు వారు మాత్రమే ప్రయత్నించగలరు. అదే మానవ జన్మ ముఖ్యమైన ప్రయత్నంగా భావించాలి.

పాక్షిక దైవ అనుభూతి పొందిన వారిలో అహంకారం, ప్రపంచ సంబంధ కోరికలైన ధన సంపాదన, కీర్తి ప్రతిష్ఠలకు పాకులాడుట, అధికార వర్గం వారి ప్రాపు కొరకు పాకులాట మొదలగునవి మనము గమనిస్తాం. జీవితంలో రోజూ జరిగే ప్రతి సంఘటన సంబంధంలో మాటల గారడి పాత్ర కూడా ఉంటుంది. దైవమార్గమును నమ్మినవారిదే అంతిమ విజయమని వృద్ధాప్యంలో గమనిస్తాము.

కరోనా నీతి: సైంటిఫిక్ గా నిర్ధారించబడిన ఆరోగ్యమునకు సంబంధించి ఆచారములు పాటించి ఆరోగ్యమును కాపాడుకోండి. రోగముల నుండి రక్షణ పొందండి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.