Tuesday, December 1, 2020

నమ్మకము

నమ్మకం మానవజీవితంలో ప్రాణంతో సమానం. అసాధ్యం అనుకున్న ఎన్నో విషయాలలో విజయం సాధించటంలో నమ్మకం పాత్ర చాలా ముఖ్యమైనది. 

ప్రపంచమంతా నమ్మకంతో నడుస్తుంది. నమ్మకం లేనిదే జీవితం లేదు. మనిషి జీవితం సక్రమంగా నడవటానికి నమ్మకము చాలా ముఖ్యము. వివాహ జీవితంలో అయినా, సంతాన విషయమైనా నమ్మకం తగ్గి హింస పెరిగి సంసారములు చెడిన సందర్భాలు చాలా ఉన్నవి.

ఉద్యోగ విషయంలో కూడా తోటివారి మీద నమ్మకముతో పనిచేయాల్సిన సందర్భాలు ఉంటాయి. నమ్మకం ఎంత ముఖ్యమైనా, మనము ప్రతి విషయంలో కనీస జాగ్రత్తలు పాటించుట ముఖ్యమని  మర్చిపోరాదు. నమ్మిన వారిని మోసం చేయడం చాలా తేలిక అని కొందరు భావించవచ్చు. నమ్మకంతో ముందుకు పోవాలి, కాని గుడ్డిగా నమ్మరాదు.

కొన్ని ఆర్థిక సంస్థలు పెట్టుబడిగా కొందరు వ్యక్తులకు ఋణములు ఇచ్చి వారు బాకీ ఎగ్గొట్టినప్పుడు ఆ సంస్థలు మోసపోయినట్లు, ఋణ గ్రహీతల పట్ల వారి నమ్మకం చెడినట్లు భావించవచ్చు. జీవితంలో సహేతుకంగా ఆలోచించి ముందుకు నడవాలి. నమ్మకంతో ముందుకు పోవాలి. నమ్మకంలో దేవునిపైన అయినా, తోటివారి పైన అయినా తగిన జాగ్రత్తలతో ముందుకు నడిస్తే మంచి జరుగుతుందని కొందరి అభిప్రాయము.  దైవము మనకు ఇచ్చిన విచక్షణ సక్రమముగా ఉపయోగించుకోవాలి.

ఈ భూమి మీద ఉండే మానవ సంబంధాలను ప్రభావితం చేయగల శక్తి అనుమానం అనే విత్తనమునకు ఉంది. ఇది మనస్సులో ప్రవేశించగానే, పెరిగి పెద్దదై, తరువాత నమ్మకమును బలహీనపరిచి పని చెడగొడుతుంది. నమ్మకం అనేది బలమైన కోట అని అనుకుంటే దానిలోకి అనుమానం అనే విష జంతువు ప్రవేశిస్తే, ఆకోట బలహీనపడి అనుమానింపబడే వ్యక్తులు ఎంత దగ్గరి వారైనా, భార్యాభర్తలు అయినా, సంతానం అయినా, హింస పెరిగి విడిపోయే చాలా సందర్భములు  మనం గమనించవచ్చు.

నమ్మకమునకు చిన్న ఉదాహరణ:

ఒక ఊరి నుండి ఒక పాలు పోసే స్త్రీ రోజూ యమునా నది దాటి పాలు పోయడానికి అవతల ఊరికి వెళ్ళేది. ఒక మారు వరదల వలన పాలు పోయడానికి వెళ్ళలేకపోయింది. భగవంతునిపై నమ్మకం ఉంచి, నదిని దాటుకుని రమ్మని ఒక అర్చకుడు చెప్పగా మరలా అలాంటి సందర్భం వచ్చినప్పుడు, నమ్మకముతో నది దాటి వెళ్ళి పాలు పోసింది. సలహా చెప్పిన అర్చకుడు ఈ చర్యకు ఆశ్చర్యపోయినట్లు కథలో చదివాను. వైద్యరంగంలో అసాధ్యమైన రోగ నివారణకు ప్రార్థన లేదా దైవంపై నమ్మకం ఒక ఉదాహరణ.

చివరగా దైవంపై నమ్మకం చాలా ముఖ్యం. దానిని సడలించవద్దు. బలహీనపరచవద్దు. కానీ అసాధ్యమైన, ఆచరణ సాధ్యం కాని కోరికలు మాత్రం కోరుకోవద్దు.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.