Wednesday, December 16, 2020

నమ్మకంతో జరిగిన మంచి

దేవాలయములలో ఆవరణ శుభ్రం చేసి, ముగ్గులు పెట్టి దైవ సేవ చేసుకుంటే మంచిదని ఒక నమ్మకం ఉంది. నాకు తెలిసిన సంఘటన మీతో పంచుకుంటాను.

చూడటానికి ఒక మాదిరిగా ఉన్న సామాన్య ఆర్థిక స్థితి కలిగిన ఒక యువతి వివాహ వయస్సు కొద్దిగ దాటింది. నమ్మకముతో ఒక దేవాలయంలో కొన్ని రోజులు దేవాలయం శుభ్రం చేయుటలో శ్రద్ధగా పాల్గొన్నది. నెల రోజుల తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగితో వివాహం జరిగి, ఆ తర్వాత మగ సంతానం కలిగినది. ఆవిడకు దైవానుగ్రహంతో మంచి జరిగినదని నాకు నమ్మకం కలిగింది.

నష్ట ద్రవ్య ప్రాప్తి, ఆర్థిక ప్రయోజనములు మెరుగుపడటానికి - కొందరి ద్వారా తెలుసుకున్న ఇంటర్నెట్ ద్వారా లభించే ఐదు పేజీలు శ్రీస్తుతి నిత్యము పఠిస్తే మేలు జరుగుతుందని నాకు నమ్మకం కలిగింది. నాలాగా నమ్మినవారు దాని ప్రయోజనం పొందమని కోరుతున్నాను.

నిత్య ఆపదల నుండి రక్షణ తరచు ప్రమాదాల బారిన పడేవారు నారాయణ కవచం నాలుగు పేజీలు ఉంటుంది. ఇంటర్నెట్ లో దొరుకుతుంది. నిత్యం చదివితే ప్రమాదం నుండి రక్షణ లభిస్తుంది.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...