Monday, November 30, 2020

జాగ్రత్తలతో వాహనములు నడుపుట

 మనం వివిధ అవసరముల దృష్ట్యా వాహనములు నడుపుట జీవిత దినచర్యలో భాగమైనది. 

ఈ వాహనములు నడుపునప్పుడు రవాణా చట్టంలో సూచించిన జాగ్రత్తలు పాటించినచో మనకు, తోటి వాహనదారులకు భద్రతతో కూడిన ప్రయాణం చేయుటలో సహాయపడగలము. వాహనములు నడుపునప్పుడు ఆలోచనలు లేకుండా రోడ్డు మీదనే దృష్టి ఉంచాలి. ఏకాగ్రత ముఖ్యం.

సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు. మద్యపానం చేసి ఉండకూడదు. వేగ నియమములు పాటించాలి. జిగ్ జాగ్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్, దురుసు డ్రైవింగ్ వద్దు. నిర్ణీత సమయమునకు తగినంత ముందుగా బయలుదేరాలి. బయలుదేరినది మొదలు గమ్యస్థలానికి చేరుటకు తొందరపడరాదు. ట్రాఫిక్ కూడళ్ళలో పోలీస్ ఉన్నా, లేకపోయినా క్రమశిక్షణ పాటించాలి. సిగ్నల్ అతిక్రమించరాదు. వాహనము నడుపువారు తమ మీద ఆధారపడిన వారిని గుర్తుంచుకొని  జాగ్రత్తగా నడపాలి. తమకంటే చిన్న వాహనములను, పాదచారుల భద్రతను గమనించాలి. చట్టబద్ధమైన నియమములు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నుండి దూరంగా ఉండుటకు ప్రయత్నించడమే దేశమునకు, సమాజమునకు మనము చేసే సేవగా భావించండి.

మనసుపెట్టి ఆలోచిస్తే వాహన నియమములు నిజజీవితంలో కూడా ఉపయోగ పడతాయి. జీవితమే ఒక వాహనంగా భావిస్తే చాలా సమస్యలు తగ్గుతాయి.

రోడ్డుమీద భద్రతా నియమాలు పాటించి ప్రమాదములు నివారించండి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.