మహాశివుడు అభిషేక ప్రియుడు. ఆ పరమశివుని వివిధ రకాల పదార్థాలతో అభిషేకిస్తే, వివిధ ఫలితాలు పొందవచ్చని దైవజ్ఞులు అంటారు.
ఆవు పాలు - సర్వసౌఖ్యం
ఆవు నెయ్యి - ఐశ్వర్యసిద్ధి
ఆవు పెరుగు - ఆరోగ్యము, బలము, కీర్తి
తేనె - తేజోవృద్ధి
మెత్తని పంచదార - దుఃఖ నాశనం
కస్తూరీ జలం - సార్వభౌమత్వం
చెరకు రసం - ధనవృద్ధి
ద్రాక్షపండ్ల రసం - కార్య జయం, జ్ఞానప్రాప్తి
మామిడి పండ్ల రసం - దీర్ఘ వ్యాధి నాశనం
నేరేడు పండ్ల రసం - వైరాగ్యము
ఖర్జూర రస జలం - సకల కార్య జయం
కొబ్బరి నీళ్ళు - సర్వ సంపద వృద్ధి
భస్మజలం - మహాపాపహరం
బిల్వదళ ఉదకం - భోగభాగ్యములు
పుష్పోదకము - భూలాభము
దూర్వోదకం - నష్ట ద్రవ్య ప్రాప్తి
రుద్రాక్షోదకం - మహదైశ్వర్యం
సువర్ణోదకం - దారిద్ర్య నాశనం
నవరత్నోదకం - గృహం, ధాన్యం, గోప్రాప్తి
పన్నీరు - పుత్రలాభం
పసుపు - సౌభాగ్యము, మంగళప్రదం
నువ్వులనూనె - అపమృత్యు హరము
నువ్వులు కలిపిన ఆవుపాలు - శని గ్రహ పీడ నివారణ
చక్కెర కలిపిన ఆవుపాలు - వాక్శుద్ధి, జడబుద్ధి నివృత్తి
శంఖోదక జలం - గృహకల్లోలాల నివారణ
No comments:
Post a Comment