మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ అని పిలవబడే అనసూయ మాత తన భక్తులైన శిష్యుల ద్వారా అందించిన ప్రకృతి వైద్యం. మలబద్దకమునకు చక్కగా పనిచేస్తుంది. దీనిని ఇంటిలోని వస్తువులతో తయారుచేసుకోవచ్చు.
ఈ పొడి తయారీకి కావలసిన దినుసులు: సోంపు, వాము, జీలకర్ర - ఒక్కొక్కటి 100 గ్రాములు
మెంతులు, మిరియాలు - ఒక్కొక్కటి 25 గ్రాములు
కరివేపాకు - రెండు దోసిళ్ళు. కావాలంటే కరివేపాకు ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు.
తయారు చేసే పద్ధతి: ముందుగా మెంతులు వేయించి, అవి సగం వేగాక వాము, సోంపు, జీలకర్ర వేసి వేయించి, అవి వేగినాక మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి అన్నీ కలిపి పొడి చేసుకోవాలి. ఒక చెంచా పొడిని మజ్జిగలో కలుపుకుని తాగాలి. చాలా బాగుంటుంది. చక్కెర వ్యాధిగ్రస్తులు కావాలంటే మెంతులు ఎక్కువ వేసుకోవచ్చు.
No comments:
Post a Comment