Monday, November 9, 2020

కదళీవన యాత్ర

దత్తావతార పరంపరలోనివారుగా శ్రీపాద వల్లభులు, మాణిక్ ప్రభు, నృసింహ సరస్వతి, అక్కల్ కోట మహారాజ్, షిర్డీ సాయినాధులను  వారి భక్తులు విశ్వసిస్తారు.

శ్రీ నృసింహ సరస్వతి: ఈయన మహారాష్ట్రలోని కరంజీ నగర్లో జన్మించారు. శ్రీ నృసింహ సరస్వతి గానుగాపూర్ లో చాలాకాలం తపస్సు చేసినారు.  కొల్హాపూర్ దగ్గరగా  నర్సోబోవాడి నృసింహ సరస్వతి తపోభూమి. రెండు పుష్కర కాలాలు స్వామి గానుగాపూర్ లో ఉన్నారు. శ్రీగురుచరిత్రలో శ్రీగురునిగా చెప్పబడిన స్వామియే శ్రీ నృసింహ సరస్వతి.

కుశాభావు అను వ్యక్తి షిర్డీ సాయినాథుని దర్శనమునకు రాగా, అతను తన వద్ద మంత్రశక్తులు ఉన్న కంకణమును విడిచి రావాలని చెప్పినట్లు, అతనిచేత 108 మార్లు గురు పారాయణ చేయించిన తరువాత అనుగ్రహించినట్లు సాయిబాబా చరిత్రలో మనకు తెలుస్తుంది.

గానుగాపూర్ మార్గం: హైదరాబాద్ నుండి గుల్బర్గా వెళ్లి అక్కడి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గానుగాపూర్ వెళ్ళాలి.

నేను చేయని కదళీవన యాత్ర విశేషాలు:

kadalivanam
 కదళీవన యాత్ర

Image Credit: Wikimedia

దత్తభక్తులు ఈ యాత్రను చాలా విశేషంగా భావిస్తారు. నాకు తెలిసిన లేక విన్న విషయాలు మీతో పంచుకుంటాను. కొంతకాలంగా కర్ణాటకలోని గానుగాపూర్ లో ఉండి భక్తులను అనుగ్రహించి, వారి కష్టాలను తొలగించే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఒక శుభదినమున కర్నూలు జిల్లాలో శ్రీశైలం వద్ద ఉన్న పాతాళగంగ (కృష్ణా నది)కి చేరారు. అక్కడినుండి వారు ఒక పూలనావలో ప్రయాణించి కదళీవన యాత్ర చేసి నదిలో అంతర్ధానమయ్యారు. 

నవంబర్ నుండి మార్చి వరకు ఈ యాత్రకు అనుకూలమైన సమయం. వెళ్లేవారు ఎనిమిది నుండి 20 మంది గల బృందంగా వెళ్ళాలి. పిల్లలు, పెద్ద వయస్సు వారు వెళ్లకుండా ఉండటం మంచిది. అడవి ప్రయాణం కనుక పూర్తి ఆడువారి బృందములు మంచిది కాదు. దట్టమైన అటవీ ప్రాంతం కనుక గ్రీన్ లేక బ్రౌన్ డ్రస్ మంచిది. నడక మార్గము కనుక సౌకర్యవంతమైన పాదరక్షలు ఉండాలి. ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. లగేజీ సులువుగా మోసుకొని వెళ్లడానికి వీలుగా ఉండాలి. టార్చ్ లైట్ తప్పక ఉండాలి. నడకలో నిశ్శబ్దంగా ఉండటం మంచిది. స్వామి అంతర్ధానమైన గుహ దగ్గరకు నీటి కొరకు దాహం తీర్చుకుంటానికి క్రూర జంతువులు వస్తాయి, జాగ్రత్త. నడక ప్రయాణంలో నీటి వసతి ఉండాలి.

పాతాళ గంగకు ఉదయం 6 గంటలకు చేరాలి. ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ ప్యాకేజ్ ద్వారా అవతలి ఒడ్డున కల బోట్ల వరకు వెళ్లాలి. అక్కడ ఏపీ టూరిజం వారివి మరియు ప్రైవేట్ బోటులు ఉంటాయి. భోజనవసతి చూసుకోవాలి.  శ్రీగురుని గుహ చేరటానికి ముందుగా 16 కిలోమీటర్ల దూరంలో గల అక్క మహాదేవి గుహను దాటిన తర్వాత కొండలు వస్తాయి.  అవతలి ఒడ్డున ఆ కొండలు దాటి 7 కిలోమీటర్ల దూరంలో గల అడవిలోకి వెళ్తే కదళీవనం వస్తుంది. 30 మెట్లు ఎక్కి దిగిన తర్వాత కదళీవనం గుహ వస్తుంది. ఈ యాత్రలో ఏపీ టూరిజం లేదా ప్రైవేటు బోటులు తిరుగుతాయి. బృందములుగా వెళ్తే సౌకర్యంగా ఉంటుంది. ఒక గంట ప్రయాణం కృష్ణానదిలో ఉంటుంది. నడక మార్గము పక్కారోడ్డు కాదు. ఏడు కిలోమీటర్ల నడక కనక మూడు లేక నాలుగు గంటలు పట్టవచ్చు. మధ్యలో నీటి వసతి ఉండదు. అడవి మార్గం కనుక నడకలో పాటించవలసిన జాగ్రత్తలు తప్పనిసరి. స్థానిక గైడ్ తోడు ఉంటే మంచిది. గుహ దగ్గర నీటి వసతి ఉంది. గుహలో స్వామివారి విగ్రహం, శివలింగము, అక్కమహాదేవి విగ్రహాలు ఉన్నాయి.

ఆసక్తి, ఆ ప్రదేశం చూసి తరించే అదృష్టవంతులు స్వామివారు అంతర్ధానమైన  పవిత్ర ప్రదేశం దర్శించి స్వామివారి అనుగ్రహం పొంది తరించండి.  శ్రీగురు శరణం దత్త క్షేత్ర దర్శనమునకు మార్గం.

మహారాష్ట్రలోని అక్కల్ కోట మహారాజ్: హైదరాబాద్ నుండి మహారాష్ట్ర వెళ్ళే బస్సులలో 6 గంటల ప్రయాణం.

కర్ణాటకలోని మాణిక్ ప్రభు: హైదరాబాద్ గుల్బర్గా బస్సు మార్గంలో గుల్బర్గాకు 60 కిలోమీటర్ల ఇవతల హుస్నాబాద్ నుండి మాణిక్ నగర్ కు 2, 3 కిలోమీటర్ల దూరం. ఆటోలు కలవు.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీపాద వల్లభులు: తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురం జన్మస్థానం. ఆ తర్వాత ఎక్కువకాలం కురువపురంలో మహిమలు చూపారు. హైదరాబాద్ నుండి మంత్రాలయం బస్సు మార్గంలో 200 కిలోమీటర్లు. మంత్రాలయం నుండి 28 కిలోమీటర్లు ప్రైవేటు వాహనాల ద్వారా వల్లభపురం చేరాలి. అక్కడి నుండి కృష్ణా నది అవతల ఒడ్డున కురువపురం ఉంది. ఇది స్వామివారు అవతారం చాలించిన ప్రదేశం. 

శరణం దత్తప్రభో

No comments:

Post a Comment

జీవితములో జాగ్రత్తలు

జీవితం చాలా విలువైనది. అడుగడుగునా తగు జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఎక్స్పైరీ డేట్ తెలియని జీవితం మనది. అయినా సమయస్ఫూర్తి, వ...