ప్రతి వారికి ఆరోగ్యం చాలా ముఖ్యం. గతజన్మలలో చేసిన కర్మ ప్రభావం వలన ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో రోగ బాధ (కొన్ని తేలిగ్గా, కొన్ని చాలా కష్టంగా) ఉండును.
భల్లాల వినాయక క్షేత్రంలోని భల్లేశ్వరుడు అష్టవినాయకులలో ఒకటి. బాంబే నుండి గోవా వెళ్లే దోవలో ఉంది. ఇక్కడ దేవుని ఆరాధిస్తే, ఈ క్రింది రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం: మూత్రపిండాల సంబంధిత వ్యాధులు, భగంధరం, ఫిస్టులా, పృష్ట సంబంధిత క్యాన్సరు మొదలైనవి. అంతే కాకుండా, జలగండ ప్రమాద నివారణ, సంతానం కలిగే శక్తి కూడా ఈ దేవుని ఆరాధిస్తే కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
అనంతపురం జిల్లా గుంతకల్ నుండి 5 కి.మీ దూరంలో ఉన్న కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే శారీరక, మానసిక ఆందోళనలుకలిగించే ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుందని ఈదేవుని భక్తులు కొలుస్తారు.
చిత్తూరు జిల్లా కాణిపాకం గుడి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరగొండ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే రోగాలు దూరమవుతాయని నమ్మిక. సంజీవని తీర్థం స్వీకరిస్తే సకల రోగ నివారణ జరుగుతుందని భక్తులు నమ్ముతారు. హనుమంతుడు లక్ష్మణుని కోసం సంజీవని పర్వతం తీసుకెళ్ళేటప్పుడు కొన్ని ఆకులు ఇక్కడ పడ్డాయని స్థలపురాణం చెబుతోంది.
అనంతపురం జిల్లా గోరంట్లకు21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుందని విశ్వాసుల భావన.
తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే కొన్ని రకాల మానసిక రుగ్మతలు, పిచ్చి నయమవుతాయని భక్తులు నమ్ముతారు.
![]() |
ఆరోగ్యం |
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ దేవాలయ దర్శనం వల్ల ఆరోగ్య ప్రాప్తి, జీవనభృతి సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.
రాజమండ్రి గోదావరి ఒడ్డున గల మార్కండేయ స్వామి ఆలయం శివుడు మార్కండేయుని చిరంజీవిగా చేసిన స్థలము అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయమును దర్శిస్తే అకాల మృత్యువు నుండి రక్షింపబడవచ్చు అని భక్తులు నమ్ముతారు.
No comments:
Post a Comment