Tuesday, October 13, 2020

మనిషి జయించవలసిన విషయములు - నిరాశ, నిస్పృహ, అసంతృప్తి

మనిషికి పెద్ద శత్రువులు నిరాశా నిస్పృహలు. ఈ శత్రువులు తనలో ప్రవేశించగానే మనిషి బలహీనమైపోతాడు.

ఇది మనసుని వ్యతిరేక భావాలతో నింపి ముందుకు సాగనియ్యదు. వీటివలన ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. ఇందుకు ముఖ్య కారణం మనం కోరుకున్నవి ఏమీ జరగకపోవడమే. ఓటమి కృంగదీస్తుంది.

పరీక్షలలో అపజయము, కోరుకున్న విద్యాసంస్థల్లో ప్రవేశం దొరకకపోవటం, మానసిక స్థితిలో మార్పులు, సంతానం లేకపోవడం, ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులు, ఆపదలు వచ్చుట, సంఘంలో తోటివారితో ఇబ్బందులు లాంటి కొన్ని కారణాల వలన నిరాశా నిస్పృహలు పెరిగి, మనసుకు ఒత్తిళ్ళు కలిగి, జీవితంపై విరక్తి కలిగినప్పుడు ఆత్మహత్యల వరకు వెళుతున్నారు.

మానసిక ఒత్తిళ్ళను జయించుటకు మనలోనే నిక్షిప్తమై ఉన్న ఒక అభిరుచి (హాబీ) మీద దృష్టి పెట్టి విజయం సాధించటం లేదా ఒక 40 రోజుల దైవ దీక్ష, యాత్రలు, దైవదర్శనం, ప్రకృతిని ఆస్వాదించుట ఒక మంచి పరిష్కారంగా చెప్పినారు.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.