Saturday, October 17, 2020

అన్నదానం

మనిషికి ఆకలి, దాన్ని తీర్చుకొనుట జీవితంలో ముఖ్య అవసరం. ఆకలి తీర్చడంలో అన్నదాతల పాత్ర ముఖ్యమైనది.

ఆంధ్రదేశంలో తూర్పు గోదావరి జిల్లాలోని డొక్కాసీతమ్మ మరియు గుంటూరు జిల్లా బాపట్లకు 25 కిలోమీటర్ల దూరంలో గల జిల్లెళ్ళమూడి గ్రామంలో నివసించిన, జిల్లెళ్ళమూడి అమ్మగా ప్రసిద్ధి చెందిన మాతృశ్రీ అనసూయాదేవి ఆకలిగా ఉన్నవారిని ఆదుకున్న సంఘటనలు అందరికీ స్ఫూర్తిదాయకం. ఈనాడు చాలా దేవాలయాలలో యాత్రికులకు చేయు అన్నదానం  భక్తుల సేవలో భగవంతుని కృపను గుర్తుకు తెస్తుంది.

షిర్డి సాయిబాబా తన జీవితకాలంలో చేసిన అన్నదాన సేవను ఆయన భక్తులు కొనసాగించటం ద్వారా, సేవను స్వామికి చేసే సేవగా భావించి, మానవ సేవ చేస్తున్నారు.

వెనుకటి రోజుల్లో కొందరు గృహస్తులు భోజన వసతి లేని నిరుపేద విద్యార్థులకు వారంలో ఒకరోజు భోజనవసతి కలుగజేసి వారు సమాజంలో మంచి చదువు నేర్చుకుని చక్కటి జీవనోపాధి సంపాదించుకొనటంలో సహాయపడిన విషయం చాలా మందికి తెలుసు.

కొందరు వ్యతిరేక భావం కలిగినవారికి అన్నదానం వల్ల సోమరిపోతుతనం, బద్ధకము పెరుగుతుందని అనిపించినప్పటికీ మొత్తం మీద ఈ సేవ అన్నార్తుల ఆకలి తీరుస్తూ, పరోపకారం ద్వారా మానవ సేవలో భాగమై ఉన్నది.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.