క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి.
శాస్త్రీయంగా నిరూపితమైన ఆచారాలను పాటిస్తే మంచిది.
చేసే వృత్తిని ప్రేమించి ఆదరించాలి.
ప్రతివారు తాము చేసే ఉద్యోగంతో పాటు వేరే టెక్నికల్ విద్య నేర్చుకుంటే రిటైర్ అయిన తర్వాత కొంత ఆదాయం వస్తుంది. వారానికి ఒక గంట ఇతరులకు సేవ చేసే సంస్థలో చేరి ఆ సంతోషాన్ని అనుభవించాలి.
పాజిటివ్ ఆలోచనలు పెంచుకుని, నెగటివ్ ఆలోచనలు తగ్గించుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది.
మీకు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక ట్రస్టు లేదా ఎన్జీవో ద్వారా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొని పరోపకారంలోని ఆనందాన్ని పూర్తిగా పొందండి.
సూపర్ మార్కెట్లలో కొనుగోలు ఆకర్షణ శక్తి ఎక్కువ. తెలివైన కొనుగోలు మాత్రమే చేసి క్రెడిట్ కార్డు, సమయం పూర్తిగా ఖాళీ చేసుకోకుండా మనశ్శాంతితో ఆనందంగా ఉండండి.
పలకరించే రోగాలకు మెడికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.
డబ్బు ఖర్చు విషయంలో పొదుపుగా ఉండాలి.
దగ్గర బంధువులకు, స్నేహితులకు లేదా పరిచయస్తులకు డబ్బులు ఇచ్చి, శత్రువులను పెంచుకోవద్దు.
అధిక వడ్డీలకు ఆశపడవద్దు. అలా అని నిజంగా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి వెనుకంజ వేయవద్దు.
మీ దగ్గర ఉన్న డబ్బు చేజారిపోతే తిరిగి రాదు.
అవసరమైనప్పుడు నలుగురికి సహాయం లేదా మానవ సహాయం చేయగల మనస్తత్వం పెంచుకోండి.
మంచి పనిని వాయిదా వేయరాదు.
బద్దకం, భయం జంట శత్రువులు.
ఏ మాటైనా మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్తామని కొందరు అనుకుంటారు. బ్రతకడానికి లౌక్యం అవసరం. మనసులో మాట బయటపడితే దగ్గర బంధువులే శత్రువులు అవుతారు. కనుక జాగ్రత్తగా ఉండండి. చాలా సందర్భాలలో లౌక్యం మనల్ని కాపాడుతుంది.
యాంత్రిక జీవనంలో ఆప్యాయతలు తగ్గిపోయాయి.
మార్కెట్ల సమయాలు తెలిసినవారు లేదా అవగాహన కలిగినవారు తక్కువగా మోసపోతారు.
సైలెన్సర్ లేని వాహనాల వల్ల పర్యావరణానికే కాక, రోడ్డు మీద ప్రయాణించే వారికి కూడా (వినికిడి) సమస్యలు వస్తాయి.
మీ శరీరం సహకరిస్తే రక్తదానం చేయండి. ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయండి.
విమర్శలు వద్దు, పొగడ్తలు ముద్దు.
No comments:
Post a Comment