Friday, October 16, 2020

షిర్డి సాయినాధుని దర్శనం

సాయినాధ శరణం. సకల కోరికలు తీర్చే దేవుడు షిర్డి సాయినాధుడు. మహారాష్ట్రలోని  షిర్డిలో కొలువై ఉన్నాడు. 

అడిగినా, అడగకపోయినా ఎల్లప్పుడూ కోర్కెలు తీర్చే సాయినాధుడు మన పక్కన ఉండగా భయమేల. మన ఊరిలో ధునితో కూడిన సాయి మందిరంలో 9 సార్లు ప్రదక్షిణ చేసి, చిటికెడు నవధాన్యాలు అంటే ఒక చెంచాడు, ఒక కొబ్బరికాయ సమర్పిస్తే  చాలు. మన కోరికలు నివేదించుకొని ధునిలో వేయాలి. నెలకు ఒకమారు చేస్తే మంచిది. మన కోర్కెలు, సమస్యల పరిష్కారం ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు, ఆర్ధిక విషయం, మిగిలిన విషయాలు అనుకూలించినపుడు ఆయన సమాధి మందిరంలో ఆయనను దర్శించుకోవాలి. గొప్ప మనశ్శాంతి, అభయము మనకు లభిస్తాయి.

షిర్డి సాయినాధుని దర్శనం

Image Reference: Wikimedia

షిర్డి పట్టణము సికింద్రాబాద్ నుండి మన్మాడ్ వెళ్ళే రైల్వే రూట్లో ఉంది. నాగర్సోల్ స్టేషన్లో దిగి అక్కడి నుండి బస్సులో రెండు గంటలు ప్రయాణిస్తే షిర్డి చేరుతారు. కొన్ని రైళ్లు షిర్డి వరకు వెళ్ళేవి కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఊర్ల నుండి ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సులు కలవు.

మనం ఏదైనా ఆహారం లేక నీరు, ఇతర పదార్థములు తీసుకునే లేదా తీసుకోబోయేటప్పుడు షిర్డి సాయినాధ సమర్పయామి అనుకుని తీసుకోవాలి. అప్పుడు మనలో భక్తిభావం, సాయినాధుని పట్ల శ్రద్ధ వృద్ధి చెందుతాయి. ఒకవేళ మనం మర్చిపోతే లేక తినే పదార్థం మీద కోరికతో వేగముగా తింటూ సమర్పించడం మర్చిపోతే కంగారు పడవద్దు. ఇంకొక మార్గం చెప్తాను.

అదేమిటంటే తిన్న తర్వాత సాయినాధ సమర్పణమస్తు అనుకోవాలి. తప్పుగా అనిపించినా, ఇది మనని మనం క్రమశిక్షణలో పెట్టుకొనడానికి మొదటి మార్గంగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా చేస్తే సరైన మార్గంలో వెళ్తాము. సాయిబాబా నిష్ఠ అంటే గాఢమైన విశ్వాసం, సబూరి అంటే ధైర్యంతో కూడిన ఓర్పు అని సాయిబాబా భక్తుడైన  ఒక రచయిత చెప్పారు.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.