Saturday, October 3, 2020

వివాహం – సంతానం

వివాహమనేది కుటుంబ అభివృద్ధి కోసం ఇద్దరు యువతీయువకుల మధ్య జరిగే ఒక ఆచారం.

తూర్పుగోదావరి జిల్లా మురమళ్ల గ్రామంలో గల శ్రీ వీరేశ్వర స్వామిని దర్శించుకుంటే వివాహం జరుగుతుందని అనేక మంది భక్తులు నమ్ముతారు. కాకినాడ - అమలాపురం బస్సు రూట్ లో కాకినాడకు 35 కిలోమీటర్ల దూరంలో మురమళ్ల గ్రామం ఉంది.


Image Reference: Wikimedia  

జన్మనక్షత్రంనాడు స్వామివారి కళ్యాణం, దోషనివారణ చేస్తే, కళ్యాణం త్వరగా జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఫలితం పొందినవారు చాలామంది ఉన్నారు.

TTDC వారి కళ్యాణం ప్యాకేజీ

తమిళనాడు టూరిస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి నెలా, రెండవ శనివారం నాడు జరిగే ప్యాకేజీ టూర్లో కళ్యాణ దేవుళ్ళు – బ్రహ్మచారులు దర్శించుట ద్వారా, ఈ కళ్యాణం ప్యాకేజీ బహుళ ప్రజాదరణ పొందినది. ఈ ప్యాకేజీ పెళ్ళి కాని యువతీ యువకుల చేత ఆదరింపబడుతున్నది. 

సంతానం  
వివాహం తర్వాత, సంపూర్ణానందం సంతానం కలిగిన తర్వాత మాత్రమే లభిస్తుంది. వాళ్ళ ఆటపాటలు, ముద్దు ముచ్చట్లతో, మధ్య మధ్య వచ్చే ఆరోగ్య సమస్యలతో సమయం గడిచిపోతుంది.

వివాహం అయిన తర్వాత సంతానం ఆలస్యం అయినపుడు జాతకం చూపించుకోవాలి. అవసరమైన వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఒకవేళ జాతకంలో సర్ప దోషం లేదా ఇతర ఏమైనా దోషాలు ఉన్నాయేమో తప్పకుండా పరిశీలించాలి. తగిన పరిహారాలు చేయాలి. సర్పసూక్తంతో పూజ చేయించుకొని, ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించుకుంటే మంచి ఫలితం వస్తుంది. సంతానం పొందడానికి పురుషసూక్త పఠనం ఎంతో మేలు చేస్తుంది.

తమిళనాడులో ఉన్న రామేశ్వరాలయం జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని దర్శించుకుని, నాగప్రతిష్ట, పూజలు చేయించుకోవటం ద్వారా నవగ్రహదోషాలు, ఇతర జాతక దోషాలు తొలగిపోయి, సంతానం పొందడానికి అనుకూలము అయినటువంటి అవకాశం కలుగుతుంది. వీటివల్ల అధికారప్రాప్తి కూడా కలుగుతుంది.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.