Tuesday, September 29, 2020

ఉద్యోగం – బదిలీలు

ఉద్యోగం అనేది మనిషి జీవితంలో ఒక గొప్ప మజిలీ. మనిషికి గొప్ప భరోసాను, ధైర్యాన్నిచ్చే ఆర్ధిక స్వాతంత్ర్యం ఉద్యోగం ద్వారానే కలుగుతుంది. ఇప్పుడు తమిళనాడులోని కొన్ని గొప్ప ఆలయాల గురించి చూద్దాం.

 

Image Reference: Wikimedia

తమిళనాడులోని చెన్నైకి సమీపంలో ఉన్న ట్రిప్లికేన్ అనే ప్రదేశంలోని పార్థసారథి ఆలయాన్ని దర్శిస్తే మంచి ఉద్యోగం దొరుకుతుందని అనేకమంది భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలోని గొప్ప ప్రత్యేకత ఏమిటంటే, విష్ణువు యొక్క ఐదు అవతారాలు కలిగి ఉన్న ఏకైక ఆలయం. ఇక్కడ ఉన్న శ్రీ యోగనరసింహస్వామిని ప్రార్దించి, అభిషేకం చేసి, చక్కెరపొంగలి నివేదిస్తే, ఉద్యోగం లభిస్తుందని, ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయని అనేకమంది నమ్ముతారు.

తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని తిరువనైక్కవల్ లోని శ్రీ అఖిలాండేశ్వరీ సమేత జంబుకేశ్వరస్వామిని దర్శించుకుంటే ఉద్యోగం వస్తుందని భక్తులు నమ్ముతారు. మంచి ఉద్యోగం లేదా ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న భక్తులు, కెరీర్‌కు సంబంధించిన కొన్ని దోషాలు ఉన్న వ్యక్తులు కూడా ఈ ఆలయంలో జంబుకేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. వారి కోరికలు నెరవేరిన తర్వాత, భక్తులు మళ్ళీ ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి చీరలు సమర్పించటం ఆనవాయితీ. కొంతమంది ఆలయానికి విరాళాలు కూడా ఇస్తారు. 

తమిళనాడు కుంభకోణంలోని శ్రీ ఆది కుంబేశ్వర ఆలయాన్ని కూడా ఉద్యోగావకాశాల కోసం ఎక్కువమంది దర్శిస్తారు. మంచి ఉద్యోగం కోసం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అభిషేకం, అర్చనలు చేసి, వస్త్రాలు సమర్పిస్తారు.  ఆలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేస్తే వారి వృత్తిలో మంచి మార్పులు వస్తాయని భక్తులు విశ్వసిస్తారు. 

ఉద్యోగంలో చేరిన తర్వాత బదిలీలు సర్వసాధారణం. కొందరికి బదిలీలు పదోన్నతులు నిర్ణీత సమయం తర్వాత వస్తాయి. ఉద్యోగంలో బదిలీ కావలసిన వారు క్రింద చెప్పబడిన దేవాలయాలు దర్శించుకోవాలి. 

Image Reference: Wikimedia

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు పది కిలోమీటర్ల దూరంలో గల ర్యాలీ జగన్మోహిని దేవాలయాన్ని దర్శించుకుంటే బదిలీ వస్తుందని నమ్మినవారు దర్శించుకుంటారు. బదిలీలు ఇష్టం లేనివారు, ర్యాలీకి వెళ్తే బదిలీ వస్తుందని భయంతో ర్యాలీ దర్శనం చేయరు. 

ఇక్కడికి అర కిలోమీటరు దూరంలో స్వయంభువుగా వెలిసిన శివాలయము దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని అందరూ నమ్ముతారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట నకిరికల్లు దగ్గరలో గల చేజెర్ల శివాలయ దర్శనం ద్వారా బదిలీ వస్తుందని నమ్మి ఎంతోమంది దర్శించుకుంటారు. స్థలపురాణం ప్రకారం ఈ స్థలం శిబి చక్రవర్తి కథ జరిగిన ప్రదేశం.

తెలంగాణలో వేములవాడ దగ్గర వరదవెల్లి గ్రామంలో చిన్న కొండపై వెలసిన రాహువుతో కూడిన శయన దత్తాత్రేయ మందిరం దర్శించుకుంటే బదిలీ వస్తుందని అనేక మంది నమ్ముతారు.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.