Monday, October 5, 2020

ఇతర విషయములు – 1

ఆడువారి సౌభాగ్యం: సౌభాగ్య ప్రదాయిని, మాంగల్య ప్రదాయిని గౌరీమాతయే. గౌరీ దేవి ఆరాధనే స్త్రీలకు ముఖ్యం. గౌరీ అమ్మవారి గుడి దేవి పార్వతి దేవి రూపంలో చాలా చోట్ల ఉన్నది. ప్రత్యేకించి దర్శనం చేసుకోదలుచుకున్నవారు వారి ఆర్థిక పరిస్థితి, ఇతర అవకాశాలు అనుకూలిస్తే బీహార్లో ఉన్న గయలో, అమ్మవారి 18 పీఠాల్లో ఒకటి మంగళ గౌరీ రూపంలో ఉన్నది. కావలసినవారు దర్శించి అమ్మవారి ఆశీర్వచనము, అనుగ్రహం పొందండి.

ఆకస్మిక ప్రమాదములు: శని, కుజ, రాహు ప్రభావముచే ఆకస్మిక ప్రమాదాలు జరుగును.  రాహువుకు దుర్గ, చండీ, గౌరీ, కాళీ ఆలయముల దర్శనం,  కుజుడికి సుబ్రహ్మణ్య క్షేత్రములు, ఆంజనేయ ఆలయ దర్శనం మేలు చేస్తాయి. శనికి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం లోని మందపల్లిలో ఉన్న ఆలయ దర్శనం చాలా మంచిది. హనుమాన్ చాలీసా పఠనం, నారాయణ కవచం ద్వారా మేలు జరుగుతుంది.

Annavaram Temple

Image Reference: Wikimedia  

సత్యనారాయణ స్వామి వ్రతం: విజయవాడ నుంచి విశాఖపట్నం మెయిన్ రైల్వే లైన్ లేదా బస్సు రూట్ లో ఉన్న తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది. అన్నవరం విజయవాడ నుండి నాలుగు గంటల ప్రయాణం. రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం మహిమగలదిగా చెబుతారు. ఇంట్లో శుభకార్యం చేసిన తర్వాత ఈ వ్రతం చేస్తారు. శుభకార్యములు చేసిన తర్వాత వచ్చే అన్ని దోషాలకు ఇది పరిష్కారంగా భావిస్తారు.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.