Tuesday, October 6, 2020

ఇతర విషయములు – 2

కాలసర్ప దోష నివారణ: అనంతపురం జిల్లా పంపనూరు సుబ్రమణ్య క్షేత్ర దర్శనం. ఈ దేవుని దర్శనం ద్వారా కాలసర్ప దోష నివారణ జాతక దోషాలు నివారణ చేయబడతాయి. పంపనూరుకు వెళ్ళటానికి జిల్లా కేంద్రమైన అనంతపురం వెళ్ళి, అక్కడ నుండి కళ్యాణదుర్గం బస్సులో అరగంట ప్రయాణం చేయాలి. గుడిని సంప్రదించవలసిన నెంబరు: 08554 250688.

ఆర్థిక విషయం: మన జీవన విధానంలో భాగంగా ఆర్థికవనరులు పెంచుకోవాలి. ఆస్తులు పెంచుకోవటానికి ప్రయత్నించాలి. మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు హైదరాబాద్ నుండి రైలు మార్గం కలదు. హైదరాబాద్ నుండి మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు ద్వారా 500 కిలోమీటర్లు 10 గంటల పాటు ప్రయాణించాలి. మహాలక్ష్మి అమ్మవారి దర్శనం ఆర్ధిక సమస్యలకు కొంత పరిష్కారం కాగలదు.

ఋణము: కుజగ్రహ దోషం వలన ఋణబాధలు ఉంటాయి. సుబ్రమణ్య క్షేత్ర దర్శనం చేత, ఆయన అనుగ్రహం ద్వారా మాత్రమే మేలు కలుగుతుంది. తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో పళని, తిరుచందూర్,  తిరుపరంకుండ్రమ్, పళముదిర్ చోలై (ఈ రెండూ మదురైకి దగ్గర), స్వామివలై, తిరుత్తణి, ఇంకా వైదీశ్వర కోవెల దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య పూజ, ఋణ విమోచన అంగారక స్తోత్రం ప్రతిరోజూ చదువుకోవాలి.

వాహనయోగం: శుక్ర గ్రహం అనుకూలిస్తే వాహన యోగం కలుగుతుంది. లక్ష్మీదేవి లేదా పరశురామ క్షేత్ర దర్శనం మంచిది. విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మీదేవి దర్శనం మంచిది.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.