Friday, September 30, 2022

న్యాయ గంట

న్యాయం మానవత్వంతో కూడుకున్నది. న్యాయ పరిధిలో విచారణ జరిగినప్పుడు శిక్షలు పరివర్తన లక్ష్యంగా నిర్ణయింపబడతాయి.

బాధితులకు సత్వర న్యాయం తక్కువ ఖర్చులతో అందాలని బాధితులు కోరుకోవడం సహజం. ప్రపంచంలోని ఏ దేశములో అయినా ఆదేశ పరిస్థితులకు తగ్గట్లు వివిధ కాల పరిమితులతో న్యాయం అందుతుంది. రాజుల పరిపాలించే దేశాలతోపాటు, అనేక ప్రజాస్వామ్య దేశాలలో న్యాయ పద్ధతులు, కఠిన కారాగార శిక్షలు మారుతాయి.

పూర్వకాలంలో రాజులు పరిపాలించేటప్పుడు అమలులో ఉన్నవని చదివిన (విన్న) న్యాయపద్ధతులను జ్ఞాపకం చేసుకుందాం. రాజుగారి కోటలో ఒకపక్క గంట వేలాడదీయబడి దానికి త్రాడు వేలాడదీసేవారు. అక్కడ కాపలావారు ఉండేవారు. సంఘములో బాధితుని యొక్క సామాజిక స్థితితో సంబంధం లేకుండా ఎవరైనా ఏ పరిస్థితిలోనైనా ఆ గంటని మ్రోగిస్తే బాధితుని న్యాయాధిపతి వద్ద హాజరు పరిచేవారు. బాధితుడు తన సమస్యను కాగితం లేకుండా, ధనవ్యయము లేకుండా, సమయం వృధా కాకుండా, తన తరఫున వాదించేవారు లేకుండా, మౌఖికంగా సమస్యను చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. 

దీనికి సంబంధించిన కొన్ని వృత్తాంతాలను చూద్దాము. ఒకరోజు రాజుగారి కోటలో ఒక ముసలి ఎద్దు గంట యొక్క తాడు పట్టుకుని లాగింది. అప్పుడు దానిని న్యాయాధిపతి ముందు హాజరు పరిచారు. దాని యజమానిని పిలిచారు. ఎంతోకాలం యజమానికి సేవ చేసిన ఆ ఎద్దు ముసలితనంలో పని చేయలేనందున యజమాని దానిని తరిమేశాడు. విషయం పూర్తిగా అర్థం చేసుకున్న న్యాయాధిపతి ఎద్దుకు న్యాయం చేసినట్లు చెప్పబడింది. 

ఇంకొక సంఘటన చూద్దాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆర్థిక దావాదేవీలలో ఒక వ్యక్తి అప్పు తీర్చినప్పటికీ, తీర్చలేదనే అభియోగంతో మరొక వ్యక్తి న్యాయాధిపతి దగ్గర ఫిర్యాదు చేస్తూ ఒక వృక్షమును సాక్షిగా చెప్పిన విధం. ఇద్దరు వ్యక్తులూ ఆ సాక్ష్యము చెప్పే చెట్టు దగ్గరికి వచ్చి న్యాయాధిపతి సమక్షంలో విచారణ జరుగుతున్నప్పుడు చెట్టు నుండి మాటలు వినపడతాయి. ఇద్దరిలో ఒకరైన బాధిత వ్యక్తి అనుమానంతో చెట్టు తొర్రలో నిప్పు అంటించగా, దానిలో నుండి కాలిన గాయాలతో ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. దీనిని గమనించిన న్యాయాధిపతి ఫిర్యాదు చేసిన వ్యక్తిని అబద్ధ ఫిర్యాదుగా భావించి తీర్పు చెప్పాడు. అబద్ధపు సాక్ష్యాన్ని ఎండగట్టిన విధానం ఆ కాలంలోనే ఉంది.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.