Wednesday, September 21, 2022

విదేశీయానం

విదేశములలో చదువు, ఉద్యోగము సాధించుటకు చేయు ప్రయత్నమును జీవిత ఉన్నతిలో భాగంగా అందరూ ఆమోదిస్తారు. 

ఈ క్రమంలో భారతదేశ రూపాయలలో మారకం రేటు బాగుండుట, మెరుగైన విద్య, ఉద్యోగం, ఇతర సౌకర్యములు, ఇతర కారణములు వంటివి విదేశాలపట్ల గల ఆకర్షణకు కారణాలుగా భావించవచ్చు. తగిన రుసుములు తీసుకుని వృద్ధులైన తల్లిదండ్రులను చూచుకొనే వృద్ధాశ్రమాలు మన బాధ్యతను తగ్గిస్తాయి.  విదేశాలకు వెళ్ళిన తర్వాత తగ్గే అతిధుల తాకిడి, ఇతర మొహమాటములు కూడా విదేశీ ఆకర్షణకు కారణాలుగా చెప్పుకోవచ్చు. 

విదేశాలలో ఉన్న వారినే వివాహము చేసుకున్నవారు అక్కడ భార్యలకు ఇంటిపనులు, ఇతర పనులలో చేయు సహాయము భార్యలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అక్కడ భార్యల సౌకర్యం చూసి ఈ దేశంలో ఉన్న ఆడవారు తమకు కూడా అలాంటి సహాయము ఉంటే బాగుండును అనుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదు.

విదేశములలో ఉండదలుచుకున్నవారు ప్రజాస్వామ్య దేశములలో గల సామాన్య పౌర చట్టాలపై అవగాహన పెంచుకుంటే, ఇబ్బందులు తక్కువగా వస్తాయి. ప్రత్యేకంగా రాజులు పరిపాలించే దేశంలో చట్టాలు కొంత పదునుగా ఉంటాయి. 

ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనదేశంలో ఒక భారతీయుడు, ఒక విదేశీయుడు నడిచి వెళుతున్నారు. ఇంతలో భారతీయునికి మూత్ర విసర్జన చేయాల్సి వచ్చినప్పుడు ప్రక్కన అతని పని పూర్తి చేసుకున్నాడు. అప్పుడు విదేశీయుడు భారతీయుని నేను కూడా నీలాగా చేయవచ్చా అని అడిగాడట. ఇప్పుడు మనదేశంలో కూడా కొన్ని నగరములలో బహిరంగ విసర్జన నేరం. దానికి జరిమానా వేస్తారు. 

కొన్ని దేశాలలో బహిరంగంగా వ్యర్థ పదార్థాలు, చిత్తుకాగితములు వేయుట, ఉమ్మివేయుటను నేరంగా పరిగణిస్తారు. అంతెందుకు, కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు మన దేశంలో కూడా బహిరంగంగా ఉమ్మివేయుటను నిషేధించారు.

విదేశాలలో ఉద్యోగం చేయువారు కొన్నిఏళ్లు ఆదేశంలో ఉండి, తమ స్వదేశమునకు ఆ డబ్బు పంపినప్పుడు సక్రమమైన పెట్టుబడుల ద్వారా దాన్ని, జీవిత కాలము ఉపయోగించుకోవచ్చునని ఆశపడితే మీరు నమ్మిన దగ్గరి బంధువులు ఆడబ్బును సక్రమంగా వినియోగించక, వారి సొంతమునకు వాడుకుంటే మీ పని పరమపద సోపానము ఆటలో పాముకు చిక్కి క్రిందకు జారిన విధంగా ఉంటుంది. నిరాశ పడక మరలా మొదటి నుండి ప్రయత్నించవలసి ఉండటం కొందరి విషయంలో జరుగుతుంది. మనదేశంలోనే కొందరు పెద్దవారు విదేశీ వస్తువులు, పరికరములు, దుస్తులు వాటి గ్యారెంటీపై నమ్మకంతో ఉండుట మనకు తెలిసినదే.

నీతి: ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్న మీ దేశీ మూలమును మరిచిపోవద్దు.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...