మనము దైవదర్శనమునకు వెళ్ళినప్పుడు స్నానము చేయుట తప్పనిసరి. కొన్ని చోట్ల వ్యాపారస్తుల పద్ధతి తెలుసుకుందాము.
వ్యాపారస్తుల ముఖ్య ఉద్దేశము పూజ వస్తువులు అమ్మటం అయినా వారు అవలంబించే పద్ధతులు తెలుసుకుందాము:
1. అనంతపురం జిల్లా కసాపురం గుంతకల్లుకి నాలుగు కిలోమీటర్ల దూరం లో గల నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర వ్యాపారులు బయట స్నానం చేసుకునే స్నానశాల దగ్గర భక్తులకు బొక్కెనలు ఇస్తారు.
2. మంత్రాలయం తుంగభద్రా నది దగ్గర స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు వ్యాపారస్తులు ప్లాస్టిక్ చెంబు ఇస్తారు.
3. షిరిడి దగ్గర గల శనిసింగణాపూర్ లో గల శనీశ్వర భగవాన్ దర్శనమునకు వెళ్ళినప్పుడు భక్తులకు స్నానము చేసిన తర్వాత మార్చుకొనుటకు వీలుగా బట్టలు తిరిగిచ్చు విధముగా ఇస్తారు. అంటే వారి దగ్గర బట్టలు తీసుకున్న భక్తులు వారి దగ్గర నూనె తీసుకుంటారని వారి ఉద్దేశము.
ఈ సేవలన్నీ గదులలో స్నానం చేసిన వారి కొరకు కాక ఇతరులకు ఉద్దేశించబడినవి. పై సేవలు వ్యాపారులు వ్యాపార దృష్టితో చేసినా, దైవ దర్శనంలో భాగంగా ఈ సౌకర్యం మనకు దైవ సేవగా అందుతున్నాయని భావించాలి.
No comments:
Post a Comment