మనిషి జీవితంలో వాతావరణమునకు తగినట్లు చాలా అలవాట్లు మార్చుకోవాలి. ఉష్ణ దేశములలో, చలి వాతావరణంలో అలవాట్లు పూర్తిగా తేడాగా ఉంటాయి.
చాలా దేశములలో పూర్తి చలివలన అలవాట్లు భిన్నముగా ఉంటాయి. స్నానమునకే కాక, చేతులు కడుక్కోవటానికి మరియు ఇతర అవసరములకు కూడా వేడి నీళ్ళు వాడుట, శరీర ఉష్ణోగ్రత సరిగ్గా ఉంచుకొనుటకు లింగ బేధం లేకుండా ప్రతివారు మత్తు పానీయం సేవించుట, ప్రత్యేక ఆహారపు అలవాట్లు, మలవిసర్జన తర్వాత పేపర్ వాడుట లాంటివి.
చలికాలం వచ్చేటప్పటికి ప్రతివారికి సరిగ్గా అరగకపోవడం, ప్రతి పనిలో బద్ధకము, ఉత్సాహం తగ్గడం మనకు తెలుస్తుంది. చలికాలమును మాగుడు కాలము అని అంటారు. చలికి తెల్లారిన వెంటనే లేవలేకపోవడం కూడా గమనిస్తాము. ఇక సముద్రము చుట్టూ జీవించేవారు మాంసాహార, శాకాహారులనే తేడా లేకుండా వారి ఆహారపు అలవాట్లలో సముద్రపు ఉత్పత్తులను స్వీకరించుట గమనించదగినది.
మారిన కాల పరిస్థితుల్లో చాలామంది పాశ్చ్యాత్య నాగరికతకు అలవాటు పడి ఆ దేశ వాతావరణమునకు సంబంధించిన పద్ధతులను ఆచరించటం జరుగుతున్నది. నిజం చెప్పాలంటే మన వాతావరణమునకు సరిపడని పరిస్థితిని ఆచరించి, పాశ్చ్యాత్య నాగరికతకు అలవాటు పడిన తర్వాత, కొన్ని వ్యతిరేక ఫలితములు వస్తే దాని స్వీకరించడం తప్పనిసరి. ఈ పద్ధతి చూస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్న సామెత గుర్తుకొస్తుంది.
ఉష్ణదేశములలో పరిమితమైన ఎండ శరీరమును చురుగ్గా ఉంచి మనిషిని ఉత్సాహంగా ఉంచితే, చలిదేశములలో పరిమితమైన చలి మేధాశక్తిని పెంచుతుంది. మితిమీరిన చలి, మితిమీరిన ఎండ ప్రాణాంతకము.
చలికాలంలో ఆకలి మందగిస్తుంది, కనుక తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవాలి. ఎండలు ఎక్కువైతే నీరసము, వడదెబ్బ. చలికాలంలో కాలి పగుళ్ళు, చర్మ సమస్యలు అధికము.
No comments:
Post a Comment