Monday, February 20, 2023

మానవులు - వయసు దాచుకోవాలని తాపత్రయం

చాలామంది సరి అయిన వయసు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ముఖమును బట్టి వయసును అంచనా వేస్తారని అనుకున్నా, కొందరి ముఖము లేతగా, మరికొందరి ముఖం ముదురుగా ఉండి అంచనా వేయలేకపోవచ్చు. 

కొందరు ముసలివారి ముఖము ముదిరిపోక,  తల నెరవక కొంత పడుచు లేక నడివయసు వారిలాగా కనిపించవచ్చు. వయసు దాచుకునే స్వభావమును గూర్చి రెండు యదార్థ విషయాలు తెలుసుకుందాం. ఒకానొక ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఒక కుర్రవాడు ఎదురుగా ఉన్న ఆడ మనిషిని ఆంటీ అని సంబోధించినప్పుడు ఆ ఆడమనిషి కోపంతో నేను ఆంటీ లాగా ఉన్నానా, నేనేమీ అంత పెద్దదాన్ని కాదు అన్న వాదన కొంతసేపు జరిగి సద్దుమణిగింది. 

అలాగే ఒక టీవీ ప్రకటనలో వచ్చే సబ్బు ప్రకటన ఒక చిన్న పిల్ల ఒక ఆడ మనిషిని అమ్మ అని పిలవటం, ఎదురుగా ఉన్న మగ వ్యక్తి మీకు ఇంత పిల్ల ఉన్నదా, మీరు కాలేజీ విద్యార్థి అనుకున్నాను అని ప్రశంసించగనే ఆవిడ సంతోషపడటం, వయసు దాచుకునే స్వభావముగల ఆడవారిని ఆకర్షింప చేస్తుంది. 

స్త్రీ, పురుషులు ఇద్దరికీ వయసు కంటే చిన్నవారిలా కనిపించాలనే స్వభావము ఉన్నప్పటికీ, స్త్రీలకు కొంత ఎక్కువ అనే అభిప్రాయం ఉంది. బహుశా ఈ కారణం వల్లనే ఆడవారి వయస్సు, మగవారి జీతం అడగరాదనే సామెత ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చు. 

దీనికి విరుద్ధంగా వయసు మళ్ళినవారు యువతరం తమను గుర్తించడం లేదని అసంతృప్తి పడతారు. వయసు దాచినా, దాచకపోయినా దానివల్ల పెద్దగా ప్రయోజనము లేదు. కానీ స్త్రీలు మాత్రము పిల్లలు ఉన్నా, చాలా చిన్నదానిలా ఉన్నావనే ప్రశంస అందుకున్నప్పుడు సంతోష పడినట్లు నేను చాలా సందర్భాలలో గమనించాను.

స్త్రీలకు ముఖ సౌందర్య అభివృద్ధికి కల అనేక సౌందర్య సాధనముల వాడకము పెరగాలని కోరుకుందాం. చివరిగా ఏ వయస్సు వారైనా చిన్నగా కనపడేలా అనేక ప్రశంసలు అందుకోవాలని అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. అది వారికి సంతోషము కలిగిస్తే, మన వంతు ప్రయత్నంగా దానికి సహకరించవచ్చు. సంతోషాభివృద్ధిరస్తు. 

నీతి: మనకు అపకారం చేసి సంతోషపడే వాళ్ళ కంటే ప్రపంచంలో ఎవరు సంతోషంగా ఉన్నా మనం సంతోషించాల్సిందే.

1 comment:

  1. అనేకమంది జుట్టు నల్లగా ఉండాలని ఒంటి రంగు తెల్లగా రావాలని కోరుకుంటారు. అయితే దీనికి పూర్తి వ్యతిరేకం గా జరుగుతూ ఉంటుంది.

    ReplyDelete

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.