Sunday, February 14, 2021

సన్మానాలు

మన ఆత్మీయులను గౌరవించి, వారిపట్ల మనము చూపించే గౌరవ విధానమును సన్మానము లేక సత్కారమని అనుకోవచ్చు. 

ఈసన్మానములలో భాగముగా వివిధపద్ధతులలో సన్మాన గ్రహీతలపై అభిమానమును వెలిబుచ్చుతారు. ఆత్మీయ సంభాషణ తర్వాత, ఆత్మీయ సన్మానమునకు ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. సన్మానములో అత్యుత్తమ స్థానముగా గజారోహణ, గజ పూలమాల చెప్తారు.

పుట్టినరోజు, వివాహదినము, పదవీ విరమణలకు సంబంధించిన సన్మానకార్యక్రమాలలో కొందరు పుష్పగుచ్ఛములు ఇచ్చి వారి అభిమానము తెలుపుకుంటే, మరికొందరు కానుకలు, నూతన వస్త్రములు, శాలువాలతో సన్మానించి వారి అభిమానమును చాటుకుంటారు. పూల దండలు సర్వ సామాన్యము. పూలదండలలో గజమాల సమర్పణ అత్యుత్తమ సన్మానముగా గుర్తింపబడినది. ఈ గజమాల చాలా బరువుగా, పొడవుగా ఉండి ఒకవ్యక్తి మోయలేని విధముగా ఉంటుంది. కనీసం ఇద్దరు బలిష్టుల సహాయము అవసరమవుతుంది. శాస్త్ర ప్రకారము సన్మాన గ్రహీత మెడపై, ఫోటో కొరకు ఆనించి తరువాత తొలగిస్తారు. లేకపోతే, ఒక మనిషి  ఆ బరువును మోయలేడు. పూర్వపు రోజులలో రాజులు పండితులకు గజారోహణ, సన్మానం చేసి తమకు గల కళాభిమానము చాటుకునేవారు.

కొన్ని సేవా సంఘములు 75 సంవత్సరములు దాటినవారి సభ్యులకు శాలువా కప్పి చేసే సన్మానం వారి ఉద్యోగ నిర్వాహణలో అంకిత భావమునకు గుర్తుగా చెప్పుకోవచ్చు. కొందరు సాహిత్యప్రియులు కొన్ని సన్మానసభలలో చేయు పొగడ్తలు,  చెప్పు పద్యములు కూడా సన్మానములో భాగమే.

అంతిమయాత్రలో పార్ధివ శరీరమునకు చేయు పూలసంస్కారము తమ ఆత్మీయులకు చేసే చివరి సన్మాన కార్యక్రమము అవుతుంది.

సన్మాన ప్రక్రియ సన్మాన గ్రహీతలకు మిగిల్చే మానసిక సంతృప్తి నిజముగా లెక్కింపదగినది, ఆహ్వానించదగినది.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...