Friday, November 27, 2020

మొహమాట పడుట లేదా బిడియ మనస్తత్వం

మనసులోని భావాలను సరిగ వ్యక్తీకరించలేకపోతే ఆ సందర్భమును  మొహమాటపడే భావముగా అనుకుంటారు. లేక బిడియ మనస్తత్వముగా భావిస్తారు. ఇది ఆత్మ నూన్యతా భావం. 

మనము ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు ఆ భోజనం వడ్డిస్తున్నవారు లేదా ఆతిథ్యము ఇచ్చేవారు చెప్పేమాట - మొహమాట పడవద్దు, కావలసినది అడిగి వేయించుకుని కడుపునిండా తినండి అని. ఈ సందర్భంలో చాలామంది మొహమాటపడి పదార్థములు రుచిగా ఉండి, ఇంకా తినాలనిపించినా అవతలివారు ఏమైనా అనుకుంటారని మారు అడగరు. అసంపూర్తిగా తిని, లేవటానికి ప్రయత్నం చేస్తారు. గమనించిన ఆ ఇంటిలోని పెద్దవారు కానీ, ఆతిథ్యం ఇచ్చినవాళ్లు కానీ అతిథి అవసరమును కనుక్కొని ఆ మొహమాటపడే పరిస్థితి నుండి అతనిని గట్టెక్కిస్తారు.

ఇలా జీవితంలో  అనేక వ్యవహారములలో ఈ సమస్య వస్తుంది. మనకు కావలసింది ఏదైనా,  సందర్భమును గమనించుకొని సరిగా భావవ్యక్తీకరణ చెయ్యలేకపోతే అనుకోని ఇబ్బందులు వస్తాయి. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. మన భావ వ్యక్తీకరణ సరిగా లేకపోతే అవతలవారు ఎప్పుడూ మనని గమనించరు. మనకు కావాల్సింది మన నోరు తెరిచి అడిగి పుచ్చుకొనుట భావవ్యక్తీకరణ యొక్క మొదటి ప్రయోజనం. భావవ్యక్తీకరణ అంటే మనకు రావలసిన న్యాయమైన కోరికలు అని పాఠకులు గమనించగలరు.

అడిగిన మాత్రమునే అన్నీ అమరవు.  ప్రేమ వ్యవహారం కానీ, ఉద్యోగంలో రావలసిన ఉన్నతి వ్యవహారము కానీ భావ వ్యక్తీకరణ చేయలేనప్పుడు ఆశాభంగం తప్పదు. ప్రతి వ్యవహారంలో భావవ్యక్తీకరణది చాలా ముఖ్యమైన పాత్రగా చెప్పుకోవచ్చు.

మొహమాటంతో సరైన సమయంలో భావవ్యక్తీకరణ చేయలేనివారు బతుకు పోరాటంలో చాలా వెనకబడి ఉంటారని గమనించాలి. కనుక మొహమాటపడుట లేక బిడియపడుట మాని కావలసినవి సాధించుకోవాలి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.