ద్వేషం నుండి కోపం వస్తుంది. అవతలి వారు మనకు రావలసినవన్నీ అనుభవిస్తున్నారని అనుకుంటే వచ్చేది ద్వేషం.
ద్వేషం కోపంగా మారిన తర్వాత అవతలి వారికి ఎలా అపకారం చేయాలా అని ఆలోచిస్తారు. అది పగగా మారిన తర్వాత వారిలోని హింసా భావం బయటకు వస్తుంది. హింస ఆలోచనను అమలు చేసిన తర్వాత ఒక రకం తేలిగ్గా, రెండవ రకం బలంగా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులకూ ఎలాంటి నష్టాలు సంభవిస్తాయో ఎవరూ చెప్పలేరు. హింస చర్యలు చట్టపరిధిలోకి వెళ్ళినప్పుడు చట్ట ప్రకారము శిక్షలు పడవచ్చు. అప్పుడు పశ్చాత్తాపపడినా నష్టం పూడ్చలేరు.
ఎవరి మీద అసూయ ఏర్పడుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్ని సందర్భములలో కారణం లేకుండా అసూయ పడవచ్చు. అసూయ, ద్వేషము అన్నదమ్ముల్లాంటివి. బహుశా మనకు లేనిది అవతల వారికి ఉండటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. ఉదాహరణకు అవతల వారికి కారు, హోదా, ఆస్తి ఉండి మనకు లేకపోవడం ఒక కారణం కావచ్చు. ఒకానొక సమయంలో అవతల వారి ముఖము లేదా మాటతీరు నచ్చక ద్వేషం పుట్టవచ్చు.
అసూయా ద్వేషములకు విరుగుడు అవతల వారి అభివృద్ధిని మనస్ఫూర్తిగా స్వాగతించటమే. అప్పుడు ఈరకమైన భావములు రావు.
అందరూ బాగుండాలి అని కోరుకునే వారికి అసూయ, ద్వేషం, పగ దగ్గరికి రావు.
సర్వేజనా
సుఖినోభవంతు.
No comments:
Post a Comment