Monday, September 7, 2020

భారతదేశంలోని దేవాలయాలు

భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని భక్తుల కోర్కెలు తీర్చేవిగా, వారి పాలిట కొంగు బంగారమై వెలిశాయి. తెలుగు రాష్ర్టాల్లో కూడా ఎన్నో ప్రముఖమైన దేవాలయాలు ఉన్నాయి. అన్నింటి గురించి అందరికీ తెలియకపోవచ్చు. కనుక నాకు తెలిసిన కొన్ని దేవాలయాల విశేషాలను మీతో పంచుకోవాలని ఈ బ్లాగును మొదలు పెడుతున్నాను. 

 

Temples in India

Image Reference: Pxhere 

కొద్ది సంవత్సరాలుగా అన్ని ఆధ్యాత్మిక మాస పత్రికల్లో ప్రచురించబడే పాఠకుల సమస్యలలో, ఎక్కువమందికి కావలసిన వివరముల నుండి వారి  ప్రత్యేకమైన కోరికలు తీర్చే దేవాలయ వివరాలు ఇందులో వ్రాస్తున్నాను. పాఠకులు తమకు ఉన్న సమస్యల ప్రకారం ఆయా దేవాలయాలను సందర్శించి, వారి సమస్యల నుండి విముక్తి కాగలరని ఆశిస్తున్నాను. అలాగే, మన జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. గ్రహ దోషాలు, జాతక దోషాలు వంటివి కూడా వాటిలో కొన్ని. అలాంటప్పుడు కొన్ని పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యలు పరిష్కారమవుతాయి. వాటిని కూడా వీలు వెంబడి మీకు వివరంగా తెలియచేస్తాను. ఇంకా అనేక మంచి, ఉపయోగకరమైన విషయాలు కూడా తెలియచేస్తాను. వీటిని ఉపయోగించుకొని మేలు పొందగలరు. అలాగే మీ విలువైన సూచనలు, సలహాలు తెలియచేయగలరు.

సకల దేవతా దీక్షలు:
గతంలో అయ్యప్ప దీక్ష 40 రోజులు చేసిన విధంగా ఇప్పుడు అన్ని దేవతలకు 40 రోజుల దీక్షలు  ఏర్పడ్డాయి. నియమ నిబంధనలు పాటిస్తూ దీక్ష తీసుకున్నప్పుడు మాత్రమే కోర్కెలు నెరవేరుతాయని దీక్షాపరుల అభిప్రాయంగా ఉన్నది.

దర్శనాలు:
ఏ కోరికలు లేకుండా యాత్రలు చేస్తూ దేవాలయాల్లో దేవతలను దర్శించుకుని, ఆయా దేవాలయాలలోని ప్రత్యేక పూజలను మీ ఆర్ధిక స్థితికి అనుగుణంగా చేసుకోగలరు. దర్శన సమయంలో పూర్తి మనసు, శ్రద్ధతో, ఆత్మ సమర్పణ గావించుకుంటూ ఉన్న ఎడల మన మనసులోని న్యాయమైన కోరికలు నెరవేరడానికి అవకాశం కలుగుతుంది. ఆత్మశుద్ధి లేని ఆచారం కానీ, పూజలను కానీ భగవంతుడు కోరడు. మనసు ప్రధానం చేసిన పూజలకు ఫలితం తప్పక లభిస్తుంది. శ్రద్ధ సబూరి ఔర్ ధ్యాన్ అన్న సాయిబాబా సూక్తులు తరచు గుర్తు తెచ్చుకోండి. 

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.