Thursday, October 29, 2020

అదృష్టము - ఉద్యోగ విద్యా విషయములలో మన ప్రయత్నం

జాతకచక్రంలో లగ్నం నుండి నాలుగో స్థానంలో శుక్రుడు, ఐదవ  స్థానంలో బుధుడు ఉన్నచో కలెక్టర్ లేదా సమానమైన ఉద్యోగ విజయం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కొంతమంది అంటారు.

అలాగే ప్రభుత్వ ఉద్యోగం దొరకాలంటే లగ్నం నుండి ఐదవ లేక తొమ్మిదవ స్థానంలో చంద్రుడు ఉండాలని కొందరు పండితుల అభిప్రాయం. వాస్తు శాస్త్ర ప్రకారం ఇల్లు కట్టేటప్పుడు ఆటంకములు ఎదురైతే ఆంజనేయస్వామికి మన్యు సూక్తంతో పూజ జరిపితే దోషములు తొలగిపోతాయని ఒక నమ్మకం ఉంది. ఇంటిలో దానిమ్మచెట్టు నాటితే ఆ దోషాలు తగ్గుతాయని కొందరి అభిప్రాయం.

గమనిక: పైన చెప్పిన విషయాలు ఒక సూచిక మాత్రమే. దేనికైనా మానవ ప్రయత్నం, పట్టుదల ముఖ్యమని మరువరాదు. ఉద్యోగానికైనా తగిన కృషి, విద్యార్హత ఉండాలి. జాతకంలో ఉన్నంత మాత్రాన మన ప్రయత్నం లేకుడా ఆ ఉద్యోగం మనకి రాదు. ఉదాహరణకు మన జాతకంలో లాటరీలో డబ్బు వస్తుంది అని వ్రాసి ఉన్నంత మాత్రాన లాటరీ టికెట్ కొనకుండా డబ్బు రాదు. మానవ ప్రయత్నం, దైవానుగ్రహము రెండూ ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగంతో సమానమైన ప్రైవేటు ఉద్యోగాలు కొన్ని ఉన్నవి. 

కృషితో నాస్తి దుర్భిక్షం, శ్రమయైవ జయతే - ఈ రెండూ మనకు చెప్పేది ఒక్కటే. మన ఉద్యోగ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ ఒక లక్ష్యం పెట్టుకుంటే దానిని సాధించడానికి కృషి, పట్టుదల ముఖ్యం. విమర్శలు లెక్క చేయవద్దు. ఆటంకాలు వస్తాయి. కానీ మీరు అనుకున్న జీవిత లక్ష్యం, జీవిత కాలపు కోరిక సాధించడం ముఖ్యం. మీ మనసుకి ఉన్న అంతర్గత శక్తిని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. చివరికి విజయం మీదే. బెస్ట్ ఆఫ్ లక్!

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.